ఘనంగా బిబి పాటిల్ జన్మదిన వేడుకలు..!

వేడుకలు
Headlines in Telugu:
  1. బి బి పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా – సాయి నగర్ వృద్ధాశ్రమంలో వేడుకలు
  2. జహీరాబాద్ మాజీ ఎంపీ బి బి పాటిల్ సేవలపై నేతల ప్రశంసలు
  3. వృద్ధులకు పళ్ళు, స్వీట్స్ మరియు భోజనం – బి బి పాటిల్ సేవా కార్యక్రమం

ప్రశ్న ఆయుధం నవంబర్ 04: కూకట్‌పల్లి ప్రతినిధి

జహీరాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు బి జె పి రాష్ట్ర నాయకులు వీర శైవ లింగాయత్ ఫెడరేషన్ అధ్యక్షులు మిత బాషి, మృదుస్వభావి ,కార్యదీక్షా పరులు బి బి పాటిల్ జన్మదిన వేడుకలు కూకట్పల్లి సాయి నగర్ లోని రాజేశ్వరి వృద్ధాశ్రమంలో ప్రగతి శీల వీర శైవ సేవ సమాజం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బి జె పి సీనియర్ నాయకులు విద్యావేత్త సంఘ సేవకులు రవీందర్ రావు అతిధి గా పాల్గొని బి బి పాటిల్ సేవలను వారు కాన్సర్ హాస్పిటల్ కు ఇచ్చిన విరాళం ఆధ్యాత్మిక సేవలను కొనియాడారు మరొక అతిధి ఆందోల్ నియోజకవర్గ బి జె పి ఇంచార్జి అడికే జగదీశ్వర్ మాట్లాడుతూ బి బి పాటిల్ ద్వారా రాజేశ్వరి వృద్ధాశ్రమానికి తగిన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వృద్దులకు పళ్ళు,స్వీట్స్ భోజన ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల వీర శైవ సమాజం అధ్యక్షులు చింది బద్రీనాథ్, అధ్యక్షులు లద్దే నాగరాజు వైస్ ప్రెసిడెంట్ జితేందర్,సెక్రెటరీ విజయాలింగం శివ రామోజీ నవీన్ ఆకాంక్ష ఫౌండేషన్ అధ్యక్షులు చిట్నీడి వెంకట రామారావు,మేడిది సుబ్బయ్య ట్రస్ట్ అధ్యక్షులు ఎం వి రావు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now