కామారెడ్డిలో బీసీ అఖిలభారత అక్రోశ సభ: 42% రిజర్వేషన్ సాధనకు బీసీల గర్జన

కామారెడ్డిలో బీసీ అఖిలభారత అక్రోశ సభ: 42% రిజర్వేషన్ సాధనకు బీసీల గర్జన

జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ IAS చిరంజీవులు, విశారదన్ మహారాజ్ హాజరు

—గర్జించిన బిసి మేధావులు, నాయకులు—“తెగించి కొట్లాడుడే” నినాదాలతో సభ మారుమోగింది

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 15 

కామారెడ్డి సత్య కన్వెన్షన్‌లో శనివారం నిర్వహించిన బీసీ అక్రోశ సభ విజయవంతంగా జరిగింది. గల్లీ నుండి ఢిల్లీ దాకా వినిపించే గర్జనతో, 42 శాతం బీసీ రిజర్వేషన్ వచ్చేంతవరకు పోరాటం ఆపబోమని వేలాది బీసీలు ఏకగ్రీవంగా నినదించారు. “జై బీసీ… జై జై బీసీ” అంటూ సభా ప్రాంగణం మారుమోగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మూడు పార్టీలను బీసీ సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి.

సభలో జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ IAS చిరంజీవులు, విశారదన్ మహారాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో సమావేశం ప్రారంభమైంది. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ “మనమెంతో–మనకంతే” అనే నినాదంతో బీసీలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. IAS చిరంజీవులు మాట్లాడుతూ 42% రిజర్వేషన్ చట్టసభల్లో ఆమోదం పొందే వరకు ఏ పార్టీని లెక్క చేయకుండా బీసీలు సమైక్య పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ—“57% జనాభా ఉన్న బీసీలు 42% రిజర్వేషన్ అడిగితే అగ్రవర్ణాలు జీర్ణించుకోలేకపోతున్నాయి… ఇది స్పష్టమైన రాజకీయ కుట్ర” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీలకు బీసీలు మద్దతు ఇచ్చినా, ఏ పార్టీ కూడా వారికి తగిన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు.

బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ సభ ఆరంభమేనని, ఇకపై బీసీలందరూ ఒక్క తాటిపై నడిచి కలిసి కట్టి 42% రిజర్వేషన్ సాధించే వరకూ ఉద్యమం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

 

సభలో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన బీసీ సంఘాల నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, సినీ దర్శకుడు శంకర్, ఉస్మానియా యూనివర్సిటీ మేధావులు, ఆకుల శ్రీనివాస్, మామిళ్ల అంజయ్య, బాలరాజు గౌడ్, ఎం.జి. వేణుగోపాల్, బాల అర్జున్ గౌడ్, డా. పుట్ట మల్లికార్జున్, హరికిషన్ గౌడ్, సబ్బని కృష్ణ, హరి సంపత్ గౌడ్, మహేష్, శ్రీధర్ గౌడ్, రమేష్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now