బీసీ కుల గణన ఒక సాహసోపేత నిర్ణయం… ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

*బీసీ కుల గణన ఒక సాహసోపేత నిర్ణయం… ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి*

*బీసీ కులగణనతో తెలంగాణలో కొత్త అధ్యాయం… పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్ గౌడ్*

*కులగణనతో బీసీలు రాజకీయంగా , సామాజికంగా మరింత అభివృద్ధి చెందటం సాధ్యం… షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

ప్రజా భవన్ లో బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులతో బీసీ కులగణన సర్వే పై నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….బీసీ కుల గణన ఒక సాహసోపేత నిర్ణయం..త్రికరణ శుద్ధిగా లెక్కతేల్చాం. వందేళ్లలో జరగనిది మేం 100 శాతం సరైన లెక్కలు తేల్చాం. ఈ కుల గణన బీసీలకు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి. ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలదే అని తెలిపారు. బీసీ కుల గణన దేశానికి రోల్‌ మోడల్‌ అని పిసిసి అధ్యక్షుడు మహేష్‌ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణన చేయాలి. బిహార్‌, కర్నాటకలో కులగణన సర్వే చేశారు…కానీ అసెంబ్లీలో మాత్రం తీర్మానం చేయలేకపోయారు అని తెలిపారు. అన్ని పార్టీలను తీసుకుపోయి కేంద్రంతో చర్చిస్తాం. బీసీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌ తోనే సాధ్యం అని మహేష్‌ కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. కుల గణన తో బీసీలు సామాజికంగా, రాజకీయంగా మరింత అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కోన్నారు.

Join WhatsApp

Join Now