Site icon PRASHNA AYUDHAM

బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్

రిజర్వేషన్లు

Oplus_131072

Headlines in Telugu:

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బుధవారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సంగారెడ్డి జిల్లా కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా జిల్లా కలక్టరేట్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని, దళిత ఇండియన్ ఛాంబర్ కామర్స్ ఇండస్ట్రీలలోనే బీసీ ఇండస్ట్రీ బిక్కిని ఏర్పాటు చేయాలని అన్నారు. పారిశ్రామిక పాలసిలో మరియు ఐటీ సెక్టార్ లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలపై విధించిన క్రిమిలేయర్ ను రద్దు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు లింగయ్య, విద్యార్థి నాయకుడు అఖిల్, శ్రీను, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version