బీసీ కమిషన్ కులగణనను పారదర్శకంగా చేయాలి – బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
*బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ డిమాండ్*
*కరీంనగర్ అక్టోబర్ 30 ప్రశ్న ఆయుధం:-*
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంకమ్మ తోటలోని బీసీ సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఏన్నం ప్రకాష్ అధ్యక్షత వహించగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు సంపత్ గౌడ్ పాల్గొని ఇరువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ నవంబర్ 1న జరిపే పర్యటన సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం. బీసీ సంఘాలు బీసీ కుల సంఘాల వినతి పత్రాల స్వీకరణ వారి యొక్క అభిప్రాయాల స్వీకరణ సమయము ఒక గంట మాత్రమే కేటాయించారు దానిని ఒక గంట నుంచి ఒక రోజుకు పెంచాలని అలాగే ఇన్నేళ్ల బీసీ సంఘాల ఆకాంక్షలని పోరాటాలని పరిగణలో తీసుకొని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 27% నుండి 42 శాతానికి పెంచుతామనీ చెప్పిన డిక్లరేషన్ ని అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుందని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే కులగనన కార్యక్రమాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తే ఊరుకోబోయేది లేదని బీసీల ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ కమిషన్ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ పారదర్శకంగా చేయాలని కోరుచున్నామని ఇప్పటికే రాష్ట్రంలో జనాభాలో 50% ఉన్న బీసీలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగ పరంగా చాలా వరకు నష్టపోయారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన సన్నాక సమావేశంలో ఒక ఫార్మాట్ ఇచ్చి దానిని ఆరు సెట్లుగా మీ సమస్యలు రాసుకొని, 20 రూపాయల స్టాంప్ పేపర్ తో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలని తెలియజేయడం జరిగిందని ఇది చూస్తుంటే బీసీల సమస్యలు తూతూ మంత్రంగా చేస్తున్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు బిసి కులగనన జరిగేంతవరకు బీసీలంతా ఐక్యంగా ఉండి కులగనన జరిగే విధానాన్ని గమనిస్తూ ఉండాలని, బీసీ కమిషన్ లో బీసీ సంఘ నాయకులను భాగస్వామ్యం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈనెల 4 నుండి ప్రారంభమయ్యే కులగరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్తో ఈనెల రెండో తేదీన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘాలతో పాటు బీసీ కుల సంఘాల నాయకులు మరియు పార్టీలకతీతంగా బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాచర్ల అంజయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు శానగొండ శ్రీనివాస్, బండారి మల్లయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి వంగల రవి గోపాల్, బిసి విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్ చారి, కడారి ఐలయ్య యాదవ్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.