Headlines :
-
వంశరాజ్ సంఘం నాయకులు బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్ ను కలిసినది
-
పాత పేరును నిషేధించేందుకు బీసీ కమిషన్ కు వంశరాజ్ సంఘం వినతిపత్రం
-
బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్ కు సానుకూలంగా స్పందించిన వంశరాజ్ సంఘం నాయకులు
-
వంశరాజ్ కులం పాత పేరును రద్దు చేయాలని సంఘం నిర్ణయం
-
వంశరాజ్ సంఘం నాయకులు బీసీ కమిషన్ చైర్మెన్ ను సన్మానించిన కార్యక్రమం
పరిగి :ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్,లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కమిషన్ ముఖ్య సమావేశంలో భాగంగా వంశరాజ్ కుల సంక్షేమ సంఘం నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఇరిగిజ్జ మురళీ కృష్ణ, చిందం పాండు,వికారాబాద్ జిల్లా అధ్యక్షులు నాగసారం రమేష్,ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ,ల ఆధ్వర్యంలో వంశరాజ్ కులానికి పాత పేరు తిట్టు పదంగా ఉండడం వల్ల, దానిని 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం “వంశరాజ్”గా మార్చి ఉత్తర్వులు జారీచేసింది.అయితే, పాత పేరును పూర్తిగానిషేధించి,భవిష్యత్తులో కూడా మళ్ళీ పాత పద్దతి పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం చేయాలని బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్,కు వినతి పత్రం అందజేశారు.మిషన్ ఛైర్మన్ జి.నిరంజన్,ఈ ప్రతిపాదనకు వెంటనే సానుకూలంగాస్పందించి,ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ భాగంగా కమిషన్ సభ్యులు రాయపోలు జయ ప్రకాష్తిరుమలగిరి సురేందర్ బాల లక్ష్మీ,లకు
సంఘం తరఫున శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పెరుగు పాండు ఎల్లయ్య పి కిష్టయ్య లోకేష్ రవి హనుమంతు శేఖర్ వినోద్, తదితరులు పాల్గొన్నారు…