బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిసి సమగ్ర కులగణన

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సమగ్ర కుల గణన..

 

కామారెడ్డి టౌన్ 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 16:

 

బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం బిసి సమగ్ర కుల గణన ప్రక్రియ దసరా కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాభిషేకం పూలదండలతో చేయాలన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపల్ దగ్గరలో ఉన్న మహాత్మా పూలే అంబేద్కర్ లకు పూలదండలతో పుష్పాభిషేకం చేయడం జరిగినది అలాగే కామారెడ్డి జిల్లా మండల గ్రామ స్థాయిలలో కూడా పుష్పాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సాప శివ రాములు నేత మాట్లాడుతూ. తెలంగాణలో సమగ్ర బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత ఆరు నెలలుగా అనేక ఉద్యమాలు చేపట్టడం ఇంకొక వైపు రాష్ట్ర హైకోర్టులో కేసు వేయడం జరిగిన తరువాత మన పోరాటానికి స్పందించి తెలంగాణ ప్రభుత్వం బీసీ సమగ్ర కుల గణన అధికారికంగా జీవో నంబర్ 18 విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ ఇది బీసీల పోరాట విజయంగా రాష్ట్రవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలకు పుష్పాభిషేకం నిర్వహించాలని సమస్త బీసీ శ్రేణులందరూ పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను ఇట్టి పోరాటం 1931 సంవత్సరం నుండి కొనసాగిస్తున్నాము మన దేశ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరములు ముగించుకొన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ బీసీలను చిన్న చూపు గానే చూస్తున్నది దేశవ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టి బీసీలు రాజ్యాధికారం చేపట్టాలని మన బహుజనుల మందరం ఏకమై గ్రామ వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు పదవులను చేపట్టి బీసీల ఉనికిని కాపాడుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమానికి పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు నేత జిల్లా ఉపాధ్యక్షుడు మారోజు మోనాచారి సిహెచ్ రాజయ్య అల్వాల గోపాల్ ఎస్ సాయ గౌడ్ బహుజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఖ్యాతం సిద్ధ రాములు అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల బాబు జిల్లా అధ్యక్షుడు కే గంగారం ఎంబీసీ జిల్లా అధ్యక్షుడు ఆర్ నాగరాజు ప్రధాన కార్యదర్శి శ్రీను రైతు సంఘం అధ్యక్షుడు భూపాల్ ఎస్సీ ఎస్టీ ఉపకుల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పి పరశురాం అడ్వకేట్స్ ఆజాద్ వేణు ప్రసాద్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మెరుగు రవి హౌసుల బ్రహ్మం అబ్దుల్ సలీం మాజీ జడ్జి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now