సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యం అని, బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రం నటరాజ్ టాకీస్ సమీపంలోని తెలంగాణ దీక్షస్థల్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం న్యాయ సాధన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని, ఆ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా బీసీ రిజర్వేషన్లు పెంచి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. అంతకుముందు దీక్షను బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర, వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, డాక్టర్ శ్రీహరి, లక్ష్మీ, కో-కన్వీనర్లు రాజేశ్వర్ స్వామి, చంద్రయ్య స్వామి, నిజాముద్దీన్, రషీద్, శ్రీకాంత్, సుధాకర్ గౌడ్, సుదర్శన్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి భాషా, హనుమంత, మంజుల గౌడ్, నాగరాణి, మంగ గౌడ్, మానస, బి.సంజీవ్, ప్రభు, జావిద్, గోపాల్, సంగమేశ్వర గౌడ్, బిక్షపతి, రామచందర్, పాండురంగం, రవి, ఎం.రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యం: బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్
Published On: November 16, 2025 7:43 pm