బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు
బీసీ జేఏసీ కన్వీనర్ సాయికుమార్ సూర్య వంశి
వనస్థలిపురం , అక్టోబర్ 16: ( ప్రశ్న ఆయుధం) ఈనెల 18న బీసీ కుల సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బందు కు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎ సాయికుమార్ సూర్య వంశీ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసన నిర్మాణంలో బడ్జెట్ కేటాయింపు లో భాగస్వామ్యానికై అసెంబ్లీ , పార్లమెంట్ లో రిజర్వేషన్లు లేకుండా కేవలం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అంటే ఎలా అని నిలదీశారు. బీసీలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని, బీసీలకు మరణ శాసనంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రిజర్వేషన్ వ్యతిరేక పార్టీలకు అతీతంగా అభ్యర్థిని బరిలో దింపి ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక కార్యదర్శి చేన్నోజి శ్రీనివాసులు, టియం ఆర్పిఎస్ అధ్యక్షులు పొట్ట పెంజర రమేష్, ముదిగొండ ఎల్లేష్, దుబ్బ ఆంజనేయులు, అందుగుల నవీణ్ కుమార్, బ్రహ్మయ్య, రామకృష్ణ, మల్లెల సుజాత తదితరులు పాల్గొన్నారు.