బీసీ జేఏసీ న్యాయసాధన దీక్ష 

బీసీ జేఏసీ న్యాయసాధన దీక్ష

 

42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్

 

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా నవంబర్ 16

 

తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలోని కానిస్టేబుల్ కిష్టయ్య ప్రాంగణంలో బీసీల న్యాయసాధన దీక్ష నిర్వహించారు.

 

దీక్షలో మాట్లాడిన బీసీ జేఏసీ నాయకులు, “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు న్యాయబద్ధమైనవే. జనాభా ప్రాతిపదికన 60 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నా, ఎన్నికల హామీ మేరకు 42% అమలు చేయడంలో ప్రభుత్వం తప్పకుండా కట్టుబడి ఉండాలి” అని డిమాండ్ చేశారు.

 

అదే సమయంలో, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతూ, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిని హెచ్చరించారు. “అవసరమైతే రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతాం” అని తెలిపారు.

 

దీక్షా శిబిరాన్ని సందర్శించిన తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్, బీసీ జేఏసీకి సంఘీభావం ప్రకటించారు.

 

కార్యక్రమంలో జిల్లా బీసీ జేఏసీ నాయకులు చింతల శంకర్ నేత, తుమ్మ మచ్చేందర్, రాజీవ్ కుమార్, రాజేందర్ (సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్), శ్రావణ్, దినేష్, పెంటయ్య, శీలసాగర్, ఇర్ఫాన్, సాప శివరాములు, నీల నాగరాజు, లక్ష్మణ్ యాదవ్, సూర్య, మల్లేష్ మల్లన్న, చాకలి రాజయ్య, మంజుల, బాజా లలిత, యమునా, నాగమణి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now