కుల గణను అడ్డుకుంటే దేశ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్టే… 

కుల
Headlines:
  1. కుల గణన అడ్డుకోవడం అభివృద్ధి అడ్డుకోవడమే
  2. బీసీ కుల నాయకుల కఠిన హెచ్చరిక
  3. కుల గణనపై కామారెడ్డి బీసీ సంఘాల భవిష్యత్ కార్యచరణ
  4. దేశ అభివృద్ధికి కుల గణన అవసరం – బీసీ నేతలు
  5. కుల గణన అడ్డుకునే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి
– కుల గణన అడ్డుకునే వారి పై క్రిమినల్ 

కేసులను చేయాలి.

– కామారెడ్డి బిసి కుల సంఘాలు

కులగణను అడ్డుకుంటే దేశ, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని, కుల గణనను అడ్డుకునే వారిపై క్రిమినల్ కేసులు చేయాలని కామారెడ్డి బీసీ కుల సంఘాల నాయకులు అన్నారు. శనివారం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం లో బీసీ సంఘాల కుల నాయకులు విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 1931 సంవత్సరంలో బ్రిటిష్ యహంలో కుల గణన నిర్వహించడం జరిగిందన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వలు కుల గణన నిర్వహించకుండా పెరిగిన జనాభా దామాషా ప్రకారంగా బీసీల లెక్కపెట్టడం జరుగుతుందనీ,

జనాభా లో 50 శాతం పైగా ఉన్న బిసిల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుసుకుంటేనే దేశ, రాష్ట్ర అభివృద్ధి లో పాలుపంచుకుంటేనే మెజార్టీ ప్రజలతో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సామాజిక, విద్య, రాజకీయ,ఆర్థిక, కుల ఆధారిత జనాభా గణనను బిసి సంఘాలుగా స్వాగతిస్తున్నము అన్నారు.ఇప్పటికైనా జనాభా లెక్కలు తీయడం వలన ప్రస్తుత బిసిల పరిస్థితి తెలిసే అవకాశం ఉందన్నారు.ఈ రోజు వరకు కుల గణనలో పాల్గొన్న బీసీ లకు ధన్యవాదాలు తెలిపారు. మిగితా కుల గణన నమోదు చేసుకోలేని వారు వెంటనే నమోదు చేసుకోవాలని, మన స్థితి గతులు తెలుసుకొని 56 కాలం కులంను కచ్చితంగా నమోదు చేసుకొనివాలని తెలియజేసారు.రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు కుల గణనుపై దుష్ప్రచారం చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. వారు కులగనను అడ్డుకుంటే దేశ అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని హెచ్చరించారు.కుల గణన ను అడ్డుకునే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో బిసి సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివ రాములు నేత, బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఖ్యాతం సిద్ధ రాములు,కుర్మా సంఘం జిల్లా ప్రతినిధి ఙివియం విఠల్, స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యదర్శి చేపూరి వెంకటస్వామి. ఎంబీసీ మొండి వారి సంఘం జిల్లా అధ్యక్షులు ఒంటెద్దు శ్రీనివాస్,మైనార్టీ అభివృద్ధి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు అంగునురి శీను, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడిపెద్ది వెంకట్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు శివరాత్రి రాజు, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు జరిగల్లా నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment