ఐక్యమత్యంతో బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలి
వేములపల్లి కాసులపహాడ్ అక్టోబర్ 18 ప్రశ్న ఆయుధం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ బీసీలంతా ఐక్యమత్యంతో బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కాసులపహాడ్ గ్రామంలో బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపు మేరకు కాసులపహాడ్ గ్రామంలోని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అన్ని బీసీ కులాల వారు కలిసి ఐకమత్యంతో బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామంలోని వివిధ కులాల కుల పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు