నర్సాపూర్, నవంబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్) నర్సాపూర్ డివిజన్ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని టీఎన్ జీవో భవన్ లో డివిజన్ స్థాయి కార్యవర్గ సమావేశం డివిజన్ ప్రెసిడెంట్ కె.శేషాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్ గౌడ్ హాజరై మాట్లాడుతూ.. విద్యా మరియు ఉద్యోగ అవకాశాలలో, నియామకాలలో, ప్రమోషన్లలో కూడా 42శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. విద్యా మరియు ఉద్యోగ అవకాశాలలో, జనాభా దామాషా ప్రకారం, రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల బీసీ విద్యార్థులకు, ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుందని తెలిపారు. కాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశ బోయిన రమా మాట్లాడుతూ.. 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పాస్ అయినప్పటికీ, చిత్తశుద్ధి లేకపోవడం బీసీ సమాజానికి చాలా నష్టం చేసినట్లు అవుతుందని తెలిపారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే బీసీ రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తెచ్చి, తర్వాత చిత్తశుద్ధి లేని విధంగా ప్రవర్తించడం చాలా అన్యాయం అని తెలిపారు. అదేవిధంగా, క్రిమిలేయర్ నిబంధన చాలా మంది బీసీ విద్యార్థులు, ఉద్యోగులకు, వారి అవకాశాలకు నష్టం చేయడం జరుగుతుందని అన్నారు. బీసీలకు అమ్మలవుతున్న క్రిమిలేయర్ నిబంధనను కచ్చితంగా తీసివేస్తేనే బీసీ సమాజం పురోగమిస్తుందని, భవిష్యత్తు విద్యార్థి లోకానికి న్యాయం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా, ప్రభుత్వం మరియు అన్ని పార్టీలు రాష్ట్రంలో మద్దతు తెలిపి, చట్ట ప్రకారం రిజర్వేషన్ పెంపు గురించి, రాజ్యాంగ పరమైన రక్షణ కోసం ప్రయత్నించకపోవడం బీసీ సమాజానికి చాలా మోసపూరితంగా మారిందని అన్నారు. అనంతరం డివిజన్ అధ్యక్షుడు శేషాచారి మాట్లాడుతూ.. నర్సాపూర్ డివిజన్ కేంద్రంలో, బీసీ స్టడీ సర్కిల్, బీసీ ఉద్యోగ భవన్, బీసీ సంక్షేమ భవన్ ల కోసం స్థలం కేటాయించి నిర్మాణాలు చేపట్టాలని, దానికోసం అధికారులను నాయకులను కలిసి ప్రయత్నిస్తామని తెలిపారు. డివిజన్ లో బీసీ ఉద్యోగుల సంక్షేమం, ఐక్యత కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగ సంఘం మెదక్ జిల్లా కార్యదర్శి యాదగిరి గౌడ్, రాష్ట్ర కార్యదర్శిలు డి.ప్రసన్నకుమార్, మహేందర్ గౌడ్, మహేంద్ర సాగర్, జ్ఞానేశ్వర్, రామాయంపేట డివిజన్ అధ్యక్షులు నవీన్, జిల్లా బాధ్యులు, రాజశేఖర్ గౌడ్, శ్రీ జ్యోతి, నరేందర్ గౌడ్, భవానీ ప్రసాద్, నరేష్, మల్లేశం సంతోష్, డివిజన్ కార్యదర్శి కృష్ణ, కోశాధికారి వెంకటకృష్ణ,డివిజన్ బాధ్యులు, సరిత, మహేందర్, ప్రవీణ్ చారి, ఊహ, గోపాల్, చంద్రశేఖర్, నవీన్, శేఖర్, స్వామి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లు 42శాతం పెంచాలి: నర్సాపూర్ డివిజన్ బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు
Published On: November 22, 2025 6:36 pm