*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి*
ప్రశ్న ఆయుదం న్యూస్, ఆగస్టు 03, కామారెడ్డి :
జాతీయ బిసి సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వరంలో జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామని సుదర్శన్ నేత ఆదేశాల మేరకు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీసు వద్ద బీసీల కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ నేత మాట్లాడుతూ గతంలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాట ఇచ్చినట్టుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. బీసీల కుల గణనకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో నెంబర్ 26 జారీ చేసినప్పటికిని పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఇతర కారణాలవల్ల కుల గణన చేపట్టలేదు. కాబట్టి వెంటనే కులగనన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి, దానికి రక్షణ కల్పించే విధంగా మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన 9వ షెడ్యూల్లో చేర్చి బిసి రిజర్వేషన్ కు రక్షణ కల్పించాలని అన్నారు. 73, 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన ఆర్టికల్ 243 ప్రకారం కులగనన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలైన గ్రామపంచాయతీ, మునిసిపాలిటీ, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు 42% రిజర్వేషన్ అమలుపరిచిన తర్వాతనే నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంఘం అధ్యక్షులు రాజీవ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బొమ్మెర రాజయ్య, కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జి తుమ్మ మచ్చందర్, మహిళా అధ్యక్షురాలు మంజుల, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సిరిగాద రాజేందర్, రామారెడ్డి యూత్ అధ్యక్షులు ఇర్ఫాన్, దోమకొండ యూత్ ప్రధాన కార్యదర్శి పుల్ల గంగాధర్, రామారెడ్డి ఇంచార్జ్ అంకం బాలకిషన్ ఇతర మండలాల బీసీ నాయకులు పాల్గొన్నారు.