స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ప్రభుత్వం
Headlines (Telugu):
  1. బీసీ రిజర్వేషన్లకు న్యాయ పరిరక్షణ చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
  2. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు
  3. కుల గణన అంశాలపై ప్రభుత్వం కీలక సమావేశం
  4. బీసీ రిజర్వేషన్ల భవిష్యత్తు: న్యాయపరమైన చిక్కుల నివారణకు చర్యలు

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులకు చెప్పారు.అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన పలు అంశాలపై ముఖ్యమంత్రి తన నివాసంలో మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌ బాబు, దామోదర్‌, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నేడు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇలాంటి కీలకమైన అంశాల్లో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు ఉండవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.

Join WhatsApp

Join Now