రాజీలేని ఉద్యమ పోరాటాల వలన బిసి హక్కుల సాధనే ధ్యేయం

*రాజీలేని ఉద్యమ పోరాటాల వలన బిసి హక్కుల సాధనే ధ్యేయం*

*ప్రతి పల్లెలో బీసీ జెండా ఎగురవేస్తాం*

*బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు సంజయ్ కుమార్*

*జమ్మికుంట జనవరి 28 ప్రశ్న ఆయుధం*

గ్రామ గ్రామాన సంస్థాగత నిర్మాణం చేసి బీసీల ఉద్యమ పోరాటాన్ని బలోపేతం చేస్తామని, ప్రతి పల్లెలో బీసీ జెండాను ఎగురవేస్తామని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ అన్నారు మంగళవారం బీసీ ఆజాది ఫెడరేషన్ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు గా కనగర్తి గ్రామానికి చెందిన మరబోయిన అంజి యాదవ్ ను నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన బీసీలను సంఘటితం చేస్తూ సంస్థాగతంగా నిర్మాణం చేస్తామని సంస్థాగత నిర్మాణంతో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు జనాభాలో 52%నికి పైగ ఉన్న బీసీలు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని వారిని అభివృద్ధి చేయడమే దేశ అభివృద్ధి అవుతుందని బీసీలకు విద్య, ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటకోసం, చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం, దేశ వ్యాప్త కుల గణన కోసం, బీసీ అట్రాసిటీ చట్టం కోసం నిరంతరం పోరాడుతామని రాజీలేని ఉద్యమాల వలన బీసీల హక్కుల సాధనే తమ ధ్యేయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ చిలకమరి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, జమ్మికుంట మండల అధ్యక్షుడు వేల్పుల చంద్ యాదవ్, మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు అన్నబోయిన రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now