బీసీ కులవృత్తుదారులందరికీ రుణాలు మంజూరు చేయాలి
– చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్ డిమాండ్
ప్రశ్న ఆయుధం న్యూస్, అక్టోబర్ 25, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లాలో బీసీ చేతి వృత్తిదారులు జిల్లా జనాభాలోనే సగం మందికి పైగా ఉన్నారని, అలాంటివారు ఈరోజు వృత్తులు కోల్పోయి వీధిన పడ్డ పరిస్థితి ఉందని చేతివృత్తిదారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్ అన్నారు. చేతి వృత్తిదారులకు అర్హులైన వారందరికీ మూడెకరాల భూమిని ఇవ్వాలని, ప్రతి వృత్తి దారుడికి 5000 రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వాలని, వృత్తి రక్షణ కోసం ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ కార్పొరేషన్ అధికారిని కలిసి విన్నవించారు. ఈ సమస్యలపై భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని దరఖాస్తులు పెట్టుకున్నారే తప్ప రుణాలు మంజూరు చేయలేదని ఇంకా అనేకమంది లబ్ధిదారులు ఉన్నారని వారందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలని ట్రైనింగ్ అయిన వారందరికీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాలు 26 కులాల నాయకులు పాల్గొన్నారు. బీసీ సంఘం నాయకులు శివరాం, విట్టల్, రాజయ్య, మైనుద్దీన్, లక్ష్మణ్, రమేష్, శ్రీనివాస్, నాగరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.