బీసీ విద్యార్థులకు న్యాయం జరగడం లేదు ..

బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సాప శివ రాములు నేత మాట్లాడుతూ, తమ వర్గాలకు అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా బీసీ విద్యార్థులకు న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యే, హక్కులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.తాను మాట్లాడిన సందర్భంగా, “ఎమ్మెల్యే బీసీ విద్యార్థుల కోసం మీరు ఏమి చేస్తారు? EWS రిజర్వేషన్ల కోసం మీరు కోర్టులో కేసులు వేస్తున్నారు. కానీ, ఓసీ జనాభా ఎంత ఉందో, EWS రిజర్వేషన్ల ద్వారా వారు ఎంత మంది లబ్ధిపొందుతారు అనేది ప్రశ్నించాలి. అందుకే మేము కుల గణన కావాలని కోరుతున్నాం,” అని అన్నారు.అయితే, కులాల గుడులకు, సంఘ భవనాలకు డబ్బులు ఇవ్వడంపై సంతోషించమని, కానీ మా కులాలకు సంబంధించి మీరు ఎప్పుడూ మద్దతుగా మాట్లాడలేదని అన్నారు. “మీ కులం కోసం మా విద్యార్థులకు అన్యాయం చేయటం తగదు,” అంటూ ఆయన మండిపడ్డారు.ఎమ్మెల్యే ఓడికి చెందిన వర్గాల కోసం పనిచేయడం కాదు, అందరికోసం సమానంగా పనిచేయాలని సాప శివ రాములు పేర్కొన్నారు. “మీరు MLA గానూ ఉండి SC, ST, BC వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను నిర్లక్ష్యం చేయడం తప్పు. మీ చర్యలను ఖండిస్తున్నాం,” అని చెప్పారు. మరింతగా, అన్ని కులాల నాయకులతో చర్చించి, త్వరలో కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు.

 

Join WhatsApp

Join Now