*బీసీ స్టడీ సర్కిల్ కు వెళ్లడానికి దారి గురించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి వినతి పత్రం అందజేసిన బీసీ నాయకులు*
*కరీంనగర్ జూలై 9 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ వెళ్లడానికి దారి మట్టి రోడ్డు ఉండడంతో వర్షాకాలం బురద మాయం కావడం జరుగుతుందని దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు బిసి సంఘ నాయకులు బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్ చారి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులు మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్ కు జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు వచ్చి చదువుకోవడం జరుగుతుందని రహదారి బురద మాయం కావడం వలన నాన్న ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు వివరించారు సహనకూలంగా స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ స్టడీ సర్కిల్ కు రోడ్డును మంజూరు చేస్తానని అలాగే బీసీ స్టడీ సర్కిల్ ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వంగల రవి గోపాల్, శ్రీకాంత్, మనోజ్ కుమార్, సంధ్య, మహేశ్వరి, పెంట శ్రీనివాస్ లక్ష్మణ్ వాసు తదితరులు పాల్గొన్నారు.