జె. ఏ. సి. ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు ,బీసీ ఎస్సీ ఎస్టీ

*జె. ఏ. సి. ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు ,బీసీ ఎస్సీ ఎస్టీ*

*ప్రశ్న ఆయుధం, మార్చి17,శేరిలింగంపల్లి, ప్రతినిధి,*

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 15% విద్యా వ్యవస్థ శాఖకు కేటాయించాలని జె. ఏ. సి. ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు ,బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్

J. A. C చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి అనేక వాగ్దానాలు చేసింది . అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థకు బడ్జెట్లో 15% కేటాయిస్తామని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆరు గ్యారంటీలు మరియు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తామని వాగ్దానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల ప్రకారం విద్యా హక్కుల చట్టం ప్రకారం 14 సంవత్సరాలు వయసు వరకు బాలబాలికలకు అందరికీ నాణ్యమైన ఉచిత విద్య బోధించే బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకో మరి కాలానుగుణంగా 2001 నుండి పాఠశాల విద్యా వ్యవస్థ నిర్వీర్యం కావడం సోచనియం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరియైన వ్యవస్థ పాఠశాలలు క్రీడా ప్రాంగణాలు బోధించే ఉపాధ్యాయులు లేక నాణ్యత విద్య లేక గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పించడం జరిగుతుంది. పేదరికంలో ఉన్న ఈ సమాజంలో అట్టడుగున ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ప్రజలు చాలావరకు విద్యకు దూరం కావడం జరుగుతుంది ముఖ్యంగా బాలికలు సరియైన

వసతులు లేక బాలికలకు మూత్రశాలలు బాత్రూం లాంటివి లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా విషయంలో మెమొరండం కూడా సమర్పించడం జరిగింది. బడ్జెట్లో కేటాయించడం కొంత జరిగిన ఆ బడ్జెట్ను పూర్తిస్థాయిలో అమలు

పరచకుండా ఖర్చు చేయకుండా ఇతర శాఖలకు బదిలీ చేయడం జరుగుతుంది. పోలీసు వ్యవస్థ తర్వాత విద్యా వ్యవస్థను ఉపాధ్యాయ ఆధ్యాత్మిక వర్గం ఇతర ఉద్యోగ వర్గం ఎన్నికల నుండి అన్ని పనులకు ప్రభుత్వం వాడుకుంటుంది. విద్యా వ్యవస్థ కుంటు పడటానికి మరొక కారణం ఇబ్బందిగా పాఠశాలలను స్థాపించుకోమని లైసెన్స్ ప్రైవేటు వ్యాపారులకు కేటాయిస్తూ పేదలకు చదువుకు దూరం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ వరంగల్ నిజాంబాద్ ముఖ్యంగా పట్టణాల్లో అరవై ఐదు శాతం విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలోనే చదువుకోవడం జరుగుతుంది ప్రభుత్వం రోజురోజుకూడా ఈ విద్యా వ్యవస్థను ప్రైవేట్ పరం చేస్తున్నటే కనబడుతుంది పౌర సమాజం కు రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక విద్య ఉన్నత విద్య విడదీసి పేదలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిదే బాధ్యత. సుమారుగా 22 వేల పాఠశాల లు తెలంగాణ రాష్ట్రంలో అంచెలంచెలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటివరకు

వరకు మూతపడిన పాఠశాలలు మూతపడుతూనే ఉన్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎంత డెవలప్మెంట్ జరిగినా విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని చెప్పక తప్పదు. విద్య పట్టణాల్లోనే జరుగుతుంది పల్లెలు సున్న. పల్లెల్లో ఒక్క విద్యా ఏ కాకుండా వైద్యం ఉపాధి ఉద్యోగం బ్రతుకుతెరువు కోసం కూలీలందరూ పేదలందరూ పట్టణాల బాట పడుతున్నారు పట్టణాలు క్రిక్కిరిసి మురికివాడలో కూడ సౌకర్యాలు లేక ప్రాథమిక పాఠశాలలు లేక పేదలు హైదరాబాద్ పట్టణంలో కూడా నిరాక్షర రాశులుగా మిగులుతున్నారు లెక్కలు మాత్రం గ్రామీణ ప్రాంతం నుండి హైదరాబాద్ వరకు 60 శాతం అక్షర రాశత అని ఏదో తప్పుడు లెక్కలు చూపిం చేసి అందరికీ విద్య అని నినాదాలు ఇస్తుంటారు. ఆర్ కృష్ణయా ద్వారా ఎన్నో పోరాటాలు చేయడం అందరికి తెలుసు ప్రాథమిక విద్య నిర్వీర్యం అవుతుందని గ్రామీణ ప్రాంతం నుండి పట్టణం వరకు విద్యకు 15% బడ్జెట్ నిధులు కేటాయించాలని కూడా సమర్పించడం జరిగింది అనేక సంఘాలు పేదల కోసం సిఆర్పిఎఫ్ డిబిఎఫ్ ఎంబీఎఫ్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్లైఏడుకేషన్ అనేక సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు ఎంత మొత్తుకున్నా హాస్టల్ ఏర్పాటుచేసి సౌకర్యాలు కల్పించి పేదలకు విద్య వసతులు కల్పించి విద్య ప్రమాణాలు పెంచాలని ఎన్నోసార్లు కోరాం.ప్రభుత్వం చేవికి ఎక్కడం లేదు. పాఠశాల ముఖ్యంగా ప్రాథమిక విద్య కుంటుపడి వేరు గా ప్రైవేటు పాఠశాలలు ఎక్కువవుతుంటే ఉన్నత విద్య కూడా పేదవారికి

అందని ద్రాక్ష పండులా మారింది. ఉన్నత విద్యలో కూడా స్కాలర్షిప్లు సమయానికి ఇవ్వక సరైన సదుపాయాలు కల్పించక బడ్జెట్లో నిధులు కేటాయించక విద్యావ్యవస్థ అభాసిపాలవుతుంది. విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు ఆఫీస్ ఉద్యోగులు కూడా ఇతర పనులకు ప్రభుత్వం వినియోగించడం గమనారహం

విద్య ప్రాథమిక హక్కు కాబట్టి 15% నిధులు కేటాయించాలి కేటాయించడమే కాకుండా పూర్తిగా ఖర్చు చేసి నిర్వీర్యమైన ఈ విద్యా వ్యవస్థను పునరుజీవం చేయాలని జె. ఎ. సి.తరపున ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేకమంది పెద్దలు తమ తమ ప్రసంగంలో విద్య గురించి మాట్లాడారు మరియు ప్రభుత్వానికి మెమొరండం కూడా సమర్పించడం జరిగింది. 2025 2026 బడ్జెట్లో 15% బడ్జెట్ కేటాయించి పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని గత సంవత్సరం 50% కూడా విద్యకు ఖర్చు చేయలేదని కేటాయింపు బడ్జెట్ ఏమీ లాభం అని పేదలు వాపోతున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి బాధపడుతున్నారు వారి ఆత్మ విశ్వాసం సన్నగిల్లింది. ప్రైవేటు పాఠశాలలు ఫుల్లుగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలో నిలు గా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో బోధన గురించి మాట్లాడితే ప్రైవేట్ పాఠశాలలే నయం అనిపిస్తుంది కానీ పేదలు ఫీజు కట్టలేక అప్పుల పాలవుతున్నారు ఇప్పుడు కొత్త నినాదం వచ్చింది అప్పుల పాలయింది కాబట్టి జీతాలు కూడా టైం పీయలేకపోతున్నాను అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడాసి తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు లక్షల కొద్ది జీతాలు అందరికీ కోట్ల…. ఖర్చులు విద్యావ్యవస్థకు డబ్బులు లేవా… లక్షల జీతాలు ఉంటే మీరిచ్చే బోటాబోటి బడ్జెట్ కేటాయింపు ఖర్చు జీతాలకే సరిపోతున్నది. తప్పకుండా 15% విద్యా వ్యవస్థకు నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని

జే .ఎ.సీ. తరపున అందరు కోరడం జరిగింది పట్టణాల్లో 65 శాతం పల్లెల్లో 55% విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 35 నుండి 45 శాతం బాలబాలికలు ప్రభుత్వపాఠశాలలో చదువుతున్నారు.

ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఉన్నత విద్య పేదలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని 15% బడ్జెట్లో విద్యకు కేటాయింపులు జరిగి చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్ నిధులు మరియు అభిమానులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

.ధనసిరి ప్రకాశ్ కార్యదర్శి బాలల హక్కుల పరిరక్షణ వేదిక (CRPF), దళిత బహుజన ఫ్రంట్ (DBF), ఎం. వి. ఫౌండేషన్ (MVF)

తల్లుల సంఘం (MOTHERS’ ASSOCIATION), నెట్‌వర్క్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్ (NPCR)

ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (NAPM), సోషల్ డెమోక్రటిక్ ఫోరం (SDF)

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC)

[17/3 4:07 PM] +91 99492 68186: ఆర్ వెంకట్ రెడ్డి ఎం.వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్

డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ కాంటెస్టింగ్ పర్సన్ శంకర్, దలిత బహుజన్ ఫ్రంట్ కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక

Join WhatsApp

Join Now

Leave a Comment