Site icon PRASHNA AYUDHAM

బీసీల పోరాటం ఫలించింది…!!

IMG 20240912 WA0000

ఫలించిన పోరాటం

కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు

నీల నాగరాజ్

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు

హైకోర్టు తీర్పుతో మూడు నెలల్లో కులగణన చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం అన్ని బీసీ సంఘాల పోరాట ఫలితం అన్నారు.

బీసీ కులగణన చేపట్టాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హైకోర్టు లో వేసిన పిటిషన్ ఆధారంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో జాజుల శ్రీనివాస్ పోరాటం ఫలించిందన్నారు.

కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం తెలంగాణ రాష్ట్రం లో బీసీల గణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీనిపై బీసీల గణన పూర్తి చేసేందుకు 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

సీజే అలోక్ ఆరాదే,జస్టిస్ జె.శ్రీనివాసరావు లతో కూడిన డివిజన్ బెంచ్ కు తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఏ.సుదర్శన్ రెడ్డి తెలియచేశారు.దీనిపై విచారించిన కోర్ట్ తీర్పును 3 నెలలకు వాయిదా వేసింది.బీసీ ల గణన పూర్తయ్యే వరకు తెలంగాణ లో జడ్పిటీసీలు,ఎంపీటీసీ లకు ఎన్నికలు నిర్వహించద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో కులగణన తర్వాతే ఎన్నికలు నిర్వహిచాలని తీర్పు రావడంతో బీసీ సంఘం పోరాటం ఫలించిందన్నారు.

Exit mobile version