రైతులకు అండదండగా ఉండండి.. నూతన వ్యవసాయ అధికారులకు సూచన..
-సిర్పూర్ శాసనసభ్యులు డా:పాల్వాయి హరీష్ బాబు
కాగజ్ నగర్ : నూతనంగా కాగజ్ నగర్ డివిజన్ కు విచ్చేసిన ఐదుగురు ఏవోలు సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ని మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలవడం జరిగింది.
ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గ రైతాంగానికి చేదోడు వాదోడుగా ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని వారికి సూచించారు.
ఈ సమావేశంలో డిఏఓ శ్రీనివాసరావు, ఏవో రామకృష్ణ,గిరీషన్, కార్తీష, ప్రేమలత, మనీషా, నాగరాజు పాల్గొన్నారు.