Site icon PRASHNA AYUDHAM

అలర్ట్‌గా ఉండండి .. వడ్లు తడవకుండా చర్యలు చేపట్టండి: సీఎం రేవంత్..!!

IMG 20250522 WA1167

*_అలర్ట్‌గా ఉండండి .. వడ్లు తడవకుండా చర్యలు చేపట్టండి: సీఎం రేవంత్..!!_*

ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించండి వర్షాల నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మరో ఐదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలోని వడ్లు తడవకుండా చర్యలు చేపట్టాలని.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ”హైదరాబాద్‌లో రోడ్లపై వరద నిలవకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పని చేయాలి’ అని సూచనలిచ్చారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు.

Exit mobile version