చిన్నారులలో పోషణలోప నివారణ చర్యలు పటిష్టంగా తీసుకోవాలి:
జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే సూచించారు
గుండాల /ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12
గురువారం నాడు ఆయన గుండాల మండలం ఆనంతారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలను మందులను రిజిష్టర్లు భౌతికంగా ఉన్న స్టాక్ వివరాలను పేషెంట్ల ప్రిస్క్రిప్షన్స్ పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సమస్యలు ఉన్నచోట ప్రత్యేకంగా జ్వర సర్వే చేపట్టాలని వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సీజనల్ వ్యాధుల పట్ల క్షేత్రస్థాయిలో అవగాహన చర్యలు చేపట్టాలని ఆరోగ్య కేంద్రం డాక్టర్ యూనస్ కు సూచించారు.తరువాత అనంతారం జిల్లా పరిషత్ స్కూల్ సందర్శించి పదవ తరగతి ఫిజికల్ సబ్జెక్ట్ సంబంధించిన డిజిటల్ క్లాస్ లను చూశారు. ఎనిమిదవ తరగతి విద్యార్ధులను వారి సబ్జెక్టులపై అడిగి తెలుసుకున్నారు. ప్రక్కనే పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ అస్సెస్మెంట్ క్యాంప్ పరిశీలించారు. వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేని పిల్లల పట్ల శ్రద్ద వహించాలని పోషణ లోప నివారణపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని మెనూ ప్రకారం ఆహారం అందించాలని, తరచూ మెడికల్ పరీక్షలు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయురాలు పునర్వసు, అంగన్వాడీ టీచర్ స్నప్నకు సూచించారు.
అనంతరం కొమ్మాయిపల్లి సబ్ సెంటర్ సందర్శించి వైద్య సేవల పట్ల డాక్టర్ హైమావతిని అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కొమ్మాయిపల్లి అంగన్వాడీ చిన్నారులతో మాట్లాడారు. చిన్నారులు పాటలు పాడారు. అల్ఫాబెట్ అప్పజెప్పడంతో కలెక్టరు సంతృప్తి వ్యక్తం చేశారు.