సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
*వావిలాల పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ కార్తీక్…
జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 27
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వావిలాల పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ కార్తీక్ అన్నారు.జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలో డాక్టర్ కార్తీక్ ప్రభుత్వ వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో 66 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు 6 మంది జ్వర పీడీతులను గుర్తించి, అక్కడే వారికీ మలేరియా కిట్స్ ద్వారా మలేరియా పరీక్షలు చేయడం జరిగిందని మిగతా పరీక్షల కొరకు ల్యాబ్ కి పంపించడం జరిగిందని బిపి షుగర్ పరీక్షలు చేసి అవసరం ఉన్నవారికి మందులు అందజేశారు సీజనల్ వ్యాధులు, వ్యక్తి గత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత పై గ్రామస్తులకు హెల్త్ ఎడ్యుకేటర్ అవగాహన కల్పించారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల పరిధిలోని అన్ని గ్రామాలలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి, నీటీ నిల్వలలో ఉన్న లార్వా లను గుర్తించి, వాటిని పారబోయించారు ఈ కార్యక్రమముoలో డాక్టర్ కార్తీక్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్ వైజర్ సదానందం, ఏఎన్ఎంలు తిరుమల, శ్రీముఖి, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.