ఇబ్రహీంపట్నంలో జ్యుస్ తాగుతున్నారా… జాగ్రత్త సుమా…
గడువు తీరిన పాలను గడ్డకట్టించి వినియోగం.ప్రమాదకరమంటున్న వైద్యులు..కొండపల్లి మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టాలంటున్న వినియోగదారులు.ఇబ్రహీంపట్నం రింగ్ చుట్టు, పెర్రీ డౌన్ ప్రాంతంలో జ్యుస్ తాగుతున్నారా ఐతే ఒకసారి ఆలోచన చేయండి. జ్యుస్ పాయింట్ల నిర్వాహకులు గడువు తీరిన పాలను గడ్డ కటిస్తూ వాటిని వినియోగిస్తున్నారు. ఒక జ్యూస్ పాయింట్ నిర్వాహకుడు 21 తేదీతో గడువు తీరిన 24వ తేదీన వినియోగించాడు. ఇదే విషయాన్ని ఒక వినియోగదారుడు అడిగితే 0 సెంటీగ్రేడు ఉన్న వాటిని వినియోగిస్తే ఏమీ కాదని చెప్పడం విశేషం. గడువు తీరిన పాలు వినియోగం వల్ల ప్రమాదమని, నిల్వ కోసం రసాయనాలు ఉపయోగిస్తారని వాటి వల్ల ఇంకా ప్రమాదమని వైద్యులు అంటున్నారు. కొండపల్లి మున్సిపల్ అధికారులు, పుడ్ తనిఖీ అధికారులు స్పందించి జ్యూస్ పాయింట్ నిర్వాహకుల ఫై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు..