కుల గణన సర్వేలో లంబాడి మిత్రులు అప్లికేషన్ ఫారం నింపేటప్పుడు జాగ్రత్త పాటించాలి .
టీజీ బీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శోభన్ నాయక్
ఖమ్మం : ఈనెల 6వ తారీకు నుండి 26వ తారీకు వరకు జరుగుతున్న ఇంటింటి సమగ్ర సర్వేలో గోర్ బంజారా లంబాడి తండా పెద్దలు , అన్నదమ్ములు , అక్క చెల్లెలు మీరు సమగ్ర సర్వే అప్లికేషన్ ఫారం నింపేటప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్ కు సంబంధించిన ఆరవ (6) కాలంలో సామాజిక వర్గం ఎస్టి కోడు 02 , ఏడవ (7) కాలంలో కులము లంబాడి కోడు 028 , పదవ (10) కాలంలో మాతృభాష లంబాడి గోర్ బోలి కోడు 4 ఇవి లంబాడీలకు సంబంధించినవి కావున వీటిని గమనించి నింపి ఇంటి యజమానులు సంతకం పెట్టాలి . మనం అలా చేయకపోవడం వల్ల వచ్చిన సర్వే అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళమవుతావని దానివల్ల మన గోర్ లంబాడి ప్రజలు నష్టపోతారని అన్నారు . దీని వలన మన జాతి జాతీయ సంపదలో మన వాటాను రాబోయే తరానికి అందించిన వాళ్లమవుతామని ఈ సందర్భంగా టీజీ బీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శోభన్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు .