తెలంగాణకు మొండి చెయ్యి…

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు మళ్ళీ మొండిచేయి
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 23
నేడు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు మళ్ళీ మొండిచేయి చూపారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ విమర్శించారు. కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం బడ్జెట్ పై స్పందించిన ఆయన మాట్లాడుతూ ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇచ్చారు..మరి తెలంగాణలో ఉన్న పది వెనుకబడిన జిల్లాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు.ఎన్నో ఏళ్ళుగా ఊరిస్తున్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉసేలేదన్నారు.ఐటిఐఆర్,ఐసర్,నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదని,గిరిజన విశ్వవిద్యాలయం పేరుకే ఏర్పాటు చేశారని,తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించలేదని పునర్విభజన చట్టంలోని హామీలను ప్రస్తావించలేదని,బడ్జెట్ లో తెలంగాణ పేరు కూడా ప్రస్తావించలేదని,తెలంగాణకు బడ్జెట్ లో కేంద్రం ఇచ్చింది గుండుసున్నా అన్నారు.

Join WhatsApp

Join Now