టి పీసీసీ సమావేశంలో పాల్గొన్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

టి పీసీసీ సమావేశంలో పాల్గొన్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి(ప్రశ్న ఆయుధం) జులై 29

గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షులు, మహేష్ కుమార్ గౌడ్, అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకు ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మేడమ్ హాజరయ్యారు. ఈ సమావేశం లో కామారెడ్డి కి చెందిన టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్ర శేఖర్ రెడ్డి,పాల్గొన్నారు. ఈ నెలాఖరులో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మేడమ్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,లు నిర్వహించనున్న పాదయాత్ర, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విషయం చర్చించడం జరిగింది. రాబోయే జడ్పిటిసి, ఎంపీటిసి, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పటిష్టత, గెలుపు విషయాల గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఆది శ్రీనివాస్, మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ రావు, బల్మూరి వెంకట్, టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now