Site icon PRASHNA AYUDHAM

సైంటిస్టులుగా మారి దేశానికి సేవ చేయండి

IMG 20250228 WA0473

సైంటిస్టులుగా మారి దేశానికి సేవ చేయండి

ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

ప్రపంచాన్ని శాసిస్తున్నది సైన్స్

ప్రతి ఒక్కరి జీవితం సైన్స్ తో ముడిపడి ఉన్నది

విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి ఉండడం సంతోషం

గజ్వేల్ ఫిబ్రవరి 28 ప్రశ్న ఆయుధం :

గజ్వేల్ లోని సెయింట్ జేవీయార్ టెక్నో హై స్కూల్ లో జాతీయ సైన్స్ డే ను పునస్కరించు కొని సైన్స్ ఫెయిర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గజ్వేల్ మండల విద్యాధికారి కృష్ణ లు విద్యార్థులు చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని శాసిస్తున్నది సైన్స్ అని సైన్స్ పట్ల విద్యార్థులకు ఆసక్తి ఉండడం సంతోషమన్నారు. సి వి రామన్ జీవితం విద్యార్థులకు ఆదర్శం కావాలని విద్యార్థులు సైంటిస్టులు గా మారి దేశానికి సేవ చేయాలన్నారు మానవ జీవితంలో సైన్స్ అతి ముఖ్యమైనదని సైన్స్ లేకుంటే జీవితమే అంధకారం అయ్యేలాగా సైన్స్ అభివృద్ధి చెందిందని అన్నారు. సర్ సివి రామన్ లాంటి ఉన్నతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని విద్యార్థులకు సూచించారు. సైంటిస్టులు మన దేశానికి ఆహారం ఆరోగ్యం లాంటి ముఖ్యమైన కొరతలు సైన్స్ ద్వారానే పరిష్కారమయ్యే అన్నారు. లౌకిక జ్ఞానం కొరవడుతున్నా ఈ రోజులలో విద్యార్థులు ప్రయోగాత్మక ప్రత్యక్ష జ్ఞానం ద్వారా పిల్లల్లో మరింత ఆసక్తి పెరిగి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు బీజం పడుతుందన్నారు. పిల్లలు చేసిన మోడల్స్ ను పరిశీలించిన వారు పిల్లల సృజనాత్మకత వెలికి తీయడంలో పాఠశాల యాజమాన్యం కృషి బాగుందని అన్ని పాఠశాలలు సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్.సి. రాజమౌళి మాజీ కౌన్సిలర్లు, గోపాల్ రెడ్డి, ఉప్పల మెట్టయ్య, ప్రిన్సిపాల్ సత్యం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version