జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ స్పీచ్ పై బీవీ రాఘవులు కీలక కామెంట్స్

*జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ స్పీచ్ పై బీవీ రాఘవులు కీలక కామెంట్స్*

జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పీచ్ పై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కీలక కామెంట్స్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మోసపూరితం అని రాఘవులు అన్నారు. కానీ, చంద్రబాబు, పవన్ గొప్ప ప్యాకేజీ అంటున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాటును సెయిల్ లో విలీనం చేయాలి.. సొంత గనులు కేటాయించాలని, స్టీల్ ప్లాట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించాలని రాఘవులు డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంకు స్టీల్ ప్లాంట్ పై శ్రద్ద లేదు.. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులు ఇస్తున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎందుకివ్వరని రాఘవులు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment