తనుగులలో వారసంత ప్రారంభం…
జమ్మికుంట డిసెంబర్ 19 ప్రశ్న ఆయుధం
జమ్మికుంట మండలంలో తనుగుల గ్రామంలో నూతనంగా కూరగాయల వార సంతను గురువారం గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీకాంత్ ప్రారంభించారు అనంతరం కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి గురువారం గ్రామంలో జరిగే కూరగాయల అంగడి ద్వారా చుట్టుపక్క గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్, పోశాల శ్రీనివాస్, మూల ప్రభాకర్,జక్కే కిరణ్, శ్రీనివాస్, చంద్రమౌళి, రమేశ్ గ్రామస్తులు పాల్గొన్నారు.