కష్టాన్ని నమ్ముకొని ఎండలో కూర్చుని
తన వృత్తినే నమ్ముకున్న పెద్దమ్మ
ప్రశ్న ఆయుధం 11 మార్చి (బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో మార్కెట్ కమిటీ కమాన్ ముందు ప్రధాన రోడ్డు పై కూర్చుని చెప్పులు కూడుతూ జీవనం కొనసాగిస్తున్నది.పెద్దమ్మ వివరాలు లోకి వెళ్తే ఈ పెద్దమ్మ ది భైంసా గ్రామం బాన్సువాడకు తన ఆడబిడ్డ కు పెళ్లిచేసి ఇచ్చింది.అల్లుడు గత సంవత్సరం ఊరేసుకొని చనిపోయాడు.అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.బతుకు దెరువు భారం కావడంతో పెద్దమ్మ ఎండలో కూర్చొని చెప్పులు కుడుతూ తన పిల్లల కోసం ఎండ అనీ కూడా లెక్కచేయకుండా కష్టాన్ని నమ్ముకుని నా బాధ ఎవరికీ చెప్పాలి అంటూ ఆ పెద్దమ్మ ప్రశ్న ఆయుధం ప్రతినిధి తో గోడు వెళ్ళ బోసుకుంది.మా పిల్లలకు ప్రభుత్వం ఆదుకోవాలని పెద్దమ్మ వేడుకుంటోoది.