గ్రామాలలో విచ్చలవిడిగా వేలుస్తున్న బెల్ట్ షాపులు!
– ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి పేద ప్రజల జీవితాలతో చెలగాటం..!!
– ఎక్సైజ్ అధికారులే బెల్ట్ షాప్ నిర్వాహకులకు ఫోన్లు చేస్తున్న వైనం..!!
– రోజువారి కష్టం మద్యానికి సమర్పణం
– యువకులు గ్రామాల్లో బెల్ట్ షాపులను నిషేధించేందుకు ముందుకు రావాలి
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
గ్రామీణ ప్రాంతాలలో యువకులు మద్యానికి బానిసై కుటుంబాల చిన్న భిన్నం అవుతున్న ప్రభుత్వాలు మాత్రం వారి గురించి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి ఆదాయం వస్తే చాలు అన్న విధంగా వ్యవహరిస్తూ పేద ప్రజల జీవితాలతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన పేద ప్రజల జీవితాలతోనే ఆటలాడుకుంటున్నాయి. రోజంతా కాయ కష్టం చేసి వచ్చిన డబ్బులతో కుటుంబాలు పోషించుకుంటున్న రోజుల్లో గ్రామాలలో బెల్ట్ షాపులు వచ్చి పేద బ్రతుకుల్లో చిచ్చు పెడుతున్నాయి.కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీలు, 526 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 49 వైన్స్ లో ఉండగా బారాన్ రెస్టారెంట్లు ఎనిమిది ఉన్నాయి. ప్రభుత్వ ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి గ్రామాలలో మద్యం ఎక్కువగా విక్రయించాలని ప్రోత్సహించడం ఒకవైపు అయితే, కొన్ని గ్రామాలలో గ్రామ కమిటీల ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి పేరుతో టెండర్లు వేసి బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు.
సదాశివ నగర్ మండలంలోని వివిధ గ్రామాలలో బెల్ట్ షాపులో మద్యం దందా జోరుగా సాగుతుంది. అక్రమ మద్యం బెల్ట్ షాపులపై నిఘ పెట్టాల్సిన అధికారులు తమ సిబ్బంది తో బెల్టు షాపులో నిర్వాహకులతో సంబంధాలు పెట్టుకొని మద్యం విక్రయాలను పెంచుతున్నారు. బెల్ట్ షాపుల నడిపే వారి నుంచి అధికారులు వారి సిబ్బంది ద్వారా నెలవారి మామూలు తీసుకుంటున్నారని సమాచారం..? పల్లెల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు కిక్కు ఫుల్లుగా కనిపిస్తుంది. గ్రామాల్లో, ఏ తండాలో చూసిన బెల్టు షాపులు పుట్టగొడుగుల వెలుస్తున్నాయి. అనుమతులు లేకుండా విచ్చలవిడిగా గ్రామాలలో పుట్టగొడుగుల బెల్ట్ షాపులు వెలుస్తున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం తనిఖీలు చేయడం లేదు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీ నిర్వహించాలని పలు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామాలలో మద్యం విక్రయించే బెల్ట్ షాపులు నిర్వాహకులు వయసుతో సంబంధం లేకుండా పిల్లలకు, యువతకు మద్యం విక్రయించడంతో వారు మద్యానికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యువత మద్యానికి బానిసలు గా మరి డబ్బుల కోసం నేరస్తులతో పరిచయం పెంచుకొని నేరం చేస్తూ పలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఏం చక్కఅధికారులు ఆదాయం కోసం చూసుకోకుండా ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించాలని పలువురు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి పేద ప్రజల జీవితాలతో చెలగాటం
ప్రస్తుతం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాప్ లేని గ్రామం లేదంటే , ఊహించలేదు ఎక్సైజ్ అధికారులు తమ టార్గెట్ నింపుకోవడానికి పచ్చని పల్లెలను వదలడం లేదు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ వైన్ షాప్ ల టార్గెట్ నింపేందుకు ఏ గ్రామంలో బెల్ట్ షాపులో మద్యం తక్కువ అమ్మిన ఆ షాప్ యజమానికి ఫోన్ చేసి మద్యం తక్కువగా ఎందుకు అమ్ముతున్నామని ఎక్సైజ్ అధికారులే అడుగుతున్నట్లు సమాచారం..!!దీంతో గ్రామాలలో మద్యం విక్రయాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.
రోజువారి కష్టం మద్యానికి సమర్పణం
ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్ పేద ప్రజల రోజు వారి కష్టం మద్యానికి సమర్పణం అవుతుంది.వివిధ గ్రామపంచాయతీలలో పేద ప్రజల ఆదాయం లొ 90 శాతం మద్యానికి విచిస్తున్నారని వివిధ గ్రామాల మహిళలు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామపంచాయతీ పరిధిలోని బెల్ట్ షాపులలో ఉదయం 10:00 నుండి మద్యం ప్రియులు మద్యం సేవిస్తుంటారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. దీనిని అరికట్టడంలో అటు ఎక్సైజ్ శాఖ కానీ, ఇటు సివిల్ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీని ద్వారా గ్రామాలలో పేద కుటుంబాలు మరింత పేదరికంలోకి నెట్టు వేయబడుతున్నాయి. గ్రామాలలో సైతం గొడవలు జరిగిన ఈ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఎవరైనా ప్రత్యేకించి మద్యం తాగాలంటే దూర ప్రాంతాలకు వెళ్లలేరు. స్థానికంగా దొరకడంతో ఎప్పుడు పడితే అప్పుడు గ్రామస్తులు మద్యాన్ని సేవించడంతో వారూ ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బెల్ట్ షాపులను నివారించాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
యువకుల్లో చైతన్యం రావాలి..
యువకుల్లో చైతన్యం రానంత కలం గ్రామాలలో పేద ప్రజల జీవితాలు మారవు. ప్రస్తుత కాలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో చదువుకున్న వ్యక్తి లేడు అంటే అతియో శక్తి కాదు అయినప్పటికీ యువకుల్లో చైతన్యం రావడం లేదు. మద్యానికి దూరంగా ఉండవలసిన యువకులే ఆ మద్యానికి బానిసై మద్యం భూతానికి బలి అవుతున్నారు. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబం చెడిపోతుందని విషయాన్ని నేటి యువత ఆలోచించ లేక పోతుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక విధంగా మద్యం సేవించడానికి అలవాటు పడిపోతున్నారు.
గ్రామాభివృద్ధి పేరుతో వేలం పాట…
సుమారు ప్రతి గ్రామంలో కొందరు పెద్దమనుషులు కలిసి గ్రామ అభివృద్ధి పేరుతో బెల్ట్ షాపుల టెండర్ వేసి ఆ టెండర్ ద్వారా వచ్చే డబ్బులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో ఆ గ్రామంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఆలోచించలేకపోతున్నారు. తమ ఇల్లు గుళ్ళు అయితే కానీ బెల్ట్ షాపు నడవడం లేదు అనే విషయాన్ని గమనించలేక పోతున్నారు. ఈ బెల్ట్ షాప్ వల్ల తమ ఆరోగ్యం కాదు కుటుంబం సైతం నష్టపోతుందన్న విషయాన్ని అటు మహిళలు, ఇటు యువకులు ఆలోచించకపోవడం విచారకరం.