లైంగికదాడి దోషులకు మరణ దండన విధించాలి..బెంగాల్ సీఎం ధర్నా..
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం ధర్నా చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు ఆందోళన చేపట్టాలని టీఎంసీ శ్రేణులకూ పిలుపునిచ్చారు. ఆర్జీకర్ వైద్యురాలి లైంగికదాడి దోషులకు మరణ దండన విధించాలని, రేప్ కేసుల్లో కఠినశిక్షలు పడేలా కేంద్ర చట్టాలను సవరించాలన్న డిమాండ్లతో ఆమె ఈ నిరసన చేపడుతున్నారు. మరోవైపు విద్యార్థులపై ఆమె నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా బీజేపీ ఏడు రోజుల ధర్నాకు పిలుపునివ్వడం గమనార్హం.