బండారు దత్తాత్రేయ”ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బేరి రామచందర్ యాదవ్
ప్రశ్న ఆయుధం జూన్08: శేరిలింగంపల్లి ప్రతినిధి

మాదాపూర్ శిల్పకళా వేదిక లో జూన్ 8వ తేదీన శl బండారు దత్తాత్రేయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసిన వారి ఆత్మకథను “ప్రజల కథే నా ఆత్మకథ “శీర్షికన పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం అలయ్ బలయ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు , రామ్నాథ్ కోవింద్ రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు జిష్ణు దేవ శర్మ మరియు కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ పుస్తకావిష్కరణ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని బండారు దత్తాత్రేయ కి శుభాకాంక్షలు తెలియజేశారు. బండారు దత్తాత్రేయ జీవితం ఆదర్శనీయమని ఒక ఆచరణాత్మకమని అన్నారు. బిజెపి పార్టీ తరఫున అనేక పదవుల అలంకరించిన ఆయన ప్రజల పక్షాన ఒక ఎత్తైన శిఖరం అని ప్రజల పక్కన ఒక నిలువెత్తు అండ అని అన్నారు. ప్రముఖుల జీవిత చరిత్రలు నేటి యువతకు ఆదర్శమని అలాంటి చరిత్ర మరొకటి ఈ “ప్రజలకథే నా ఆత్మకథ” పుస్తకం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సామాజిక సేవ కర్త బాలల అశోక్ , గోకుల్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు నేర్సు శ్రీధర్ యాదవ్, గొర్రెల మేకల తప్పకుండా వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, భేరి చంద్రశేఖర్ యాదవ్, మరియు కేంద్ర రాష్ట్ర మంత్రి గవర్నర్ లు అలయ్ బలయ్ టీం సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని బండారు దత్తాత్రేయ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 11