*రాజ్యం మనది -రాజ్యాధికారం మనది అని బీసీలకు పిలుపునిచ్చిన బేరి రామచందర్ యాదవ్*
*
వరంగల్ బీసీ యుద్ధభేరి విజయవంతం చేసిన బీసీ నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం మృత్తిదాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ రాష్ట్ర సలహాదారి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపకులు సౌధ అని భూమన్న యాదవ్ లు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ యుద్ధభేరి బహిరంగ సభ వరంగల్ జిల్లా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో లో జరిగిన బీసీ జేఏసీ యుద్ధభేరి బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అయ్యారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపిఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలందరూ ఏకం కావాలి అని రాజ్యాధికారం దిశగా బీసీలందరూ సమైక్యంగా నడవాలని అధిక జనాభా ఉన్న బీసీలు రాజకీయ రంగంలో ముందుకు సాగాలని అన్నారు అదేవిధంగా మాట్లాడుతూ బీసీలను చిన్న చూస్తున్న అగ్రవర్గాలకు బుద్ధి చెప్పాలని బీసీ లందరూ ఏకమై రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలని బీసీల పేరుతో అది అగ్రవర్ణాలు అభివృద్ధికి ముందుకు వెళుతున్నారు బీసీలను అనుగదొక్కుతూ కాబట్టి బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం దిశగా ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి పేరుపేరునా సభ వేదిక సమక్షంలో పిలుపునిచ్చినారు ఎమ్మెల్సీ తీర్మారు మల్లన్న సభ సమక్షంలో బీసీ నాయకులందరి ఐక్యంగా ఉండి రానున్న ఎమ్మెల్సీ స్థానిక ఎలక్షన్లు ప్రతి ఒక్కరు బీసీలు పాల్గొని రాజకీయంలో ముందుకు పోవాలని అన్నారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీలంతా ఐక్యమై బీసీల రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని మన గొంతులను గట్టిగా లేవనెత్తి బీసీల రాజ్యం సాధించుకోవాలని దీనికోసం ప్రతి బీసీ నాయకుడు ముందడుగు వేసి ప్రజలను మేలుకొలిపి బీసీల రాజ్యాన్ని సాధించుకోవాలని అన్నారు. రాజ్యం మనది రాజ్యాధికారం మనది అని బీసీలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు అందేల కుమార్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం బెల్లంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బోయిని తిరుపతి యాదవ్ బెల్లంపల్లి మండల అధ్యక్షులు పాయవేనికి మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.