Site icon PRASHNA AYUDHAM

బెస్ట్ అవైల్డ్ ఎబుల్ స్కూల్స్ నిలిపివేతతో తల్లిదండ్రుల్లో ఆందోళన

IMG 20251008 192412

Oplus_131072

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో బెస్ట్ అవైల్డ్ ఎబుల్ స్కూల్ స్కీమ్ ను తాత్కాలికంగా నిలిపి వేయాలని బెస్ట్ అవైల్డ్ ఎబుల్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకోవడంతో వందలాది విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. బుధవారం ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, పేరెంట్స్ అసోసియేషన్ నాయకుడు మార్కుంది రాజులు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు బెస్ట్ అవైల్డ్ ఎబుల్ స్కూల్స్‌కు ఎంపికయ్యారని తెలిపారు. గత మూడేళ్లుగా నిధులు అందకపోవడం వల్ల పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను పాఠశాలలకు అనుమతించకూడదని ఏకగ్రీవంగా తీర్మానించాయని అన్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన పెండింగ్ బిల్లులు నిలిచి పోవడంతో పాఠశాలలు పుస్తకాలు, దుస్తులు, ఆహారం వంటి సదుపాయాలను సకాలంలో అందించలేక పోతున్నాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఫోరమ్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహ కార్యదర్శి పాండు రంగం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version