డాక్టర్ బాలుకు ఉత్తమ రక్తదాత పురస్కారం

డాక్టర్ బాలుకు ఉత్తమ రక్తదాత పురస్కారం

ప్రశ్న ఆయుధం న్యూస్, అక్టోబర్ 01, కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ వైద్యశాలలో జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా 17 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా 74 సార్లు రక్తదానం తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారికి కావలసిన రక్తాన్ని సకాలంలో అందజేస్తున్నందుకుగాను ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుకు ఉత్తమ రక్తదాత పురస్కారాన్ని వైద్యశాల సూపరిండెంట్ ప్రొఫెసర్ రామ్ సింగ్, డాక్టర్ ఫరీద, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బన్సీలాల్ లు సంయుక్తంగా అందజేశారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, నిరుపయోగంగా ఉన్న సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్ యంత్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీనివలన డెంగ్యూ వ్యాధితో బాధపడే పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సహాయం అందుతుందని అన్నారు. రక్తదానానికి సహకరిస్తున్న రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తమ రక్తదాత పురస్కారాన్ని అందజేస్తున్న ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ ప్రొఫెసర్ రామ్ సింగ్

Join WhatsApp

Join Now