స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఉత్తమ రక్తదాతల అవార్డుల ప్రధాన కార్యక్రమం
ప్రశ్న ఆయుధం, కామారెడ్డి :
కామారెడ్డి రక్తదాతల సంబంధాన్ని ఏర్పాటు చేసి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఉత్తమ రక్తదాతల, మోటివేటర్ అవార్డుల ప్రధాన కార్యక్రమం ఆదివారం ఉదయం 09:30 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందని కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డిఐజి డాక్టర్ దుద్దెల శ్రీనివాస్, సిఎంఎస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్, లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షులు చిలువేరి మారుతి లు విచ్చేసి రక్తదాతలను అభినందించడం జరుగుతుందని, కావున పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు డాక్టర్ పి వేదప్రకాష్, ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్, ఉపాధ్యక్షులు జమీల్, డాక్టర్ పుట్ల అనిల్, సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్, వెంకటరమణలు పాల్గొన్నారు.