ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు….
శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి
ప్రశ్న ఆయుధం /మోటకొండూర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జ్
మోటకొండూరు మండలం నాంచారి పేట గ్రామానికి చెందిన శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థిని విద్యార్థులుఎగ్జామ్‌కు ఒక్క రోజు ముందే సెంటర్ సరిచూసుకోవాలనీ ఎగ్జామ్ హాల్‌లోకి సెల్ ఫోన్లు, డిజిటల్ వాచ్‌లు, షూలు అనుమతి లేదువేసవి కాలం దృష్ట్యా విద్యార్థులంతా అల్పాహారం తిని పరీక్షకు వెళ్లాలని విద్యార్థులు అందరూ చురుకుగా ఉంటూ 3 గంట సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి విద్యార్థులు ద్విగ్విజయంగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించడం ద్వారా తదుపరి ముందుకు వెళ్లాలని పరీక్ష బాగా రాయలేదని మార్కులు తక్కువ వస్తాయని భయాందోళనకు గురికావద్దని చదువే సర్వసం కాదని చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే అని నేటి సమాజంలో తక్కువ చదువు చదివినవారు… అసలు చదువే రాని వారు వ్యాపార రాజకీయ రంగంలో రాణిస్తు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారని వారిని కూడా ఆదర్శంగా తీసుకొని చదువు అనే పరీక్షలతో పాటు నిజజీవిత పరీక్షలలో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.