రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో బేటి బచావో బేటి పడావో అవగాహన స్టాల్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా జనవరి 07
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా మహిళా సాధికారత కేంద్రం వారు బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా అవగాహన స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో పథక లక్ష్యాలు, అమలవుతున్న కార్యక్రమాలు, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ద్వారా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు, మహిళలకు అందిస్తున్న ఉపాధి కార్యక్రమాలపై వివరించారు. అలాగే సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందిస్తున్న సేవలు, చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలపై వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు, సందర్శకులకు అవగాహన కల్పించారు. ఈ స్టాల్‌ను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సుధామ లక్ష్మీ సందర్శించి జిల్లా మహిళా సాధికారత కేంద్రం వారు నిర్వహిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, సఖి కేంద్రం సిబ్బంది, బాలరక్ష భవన్ సిబ్బంది పాల్గొన్నారు.