Site icon PRASHNA AYUDHAM

ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తేనే గుర్తింపు:

ప్రజలకు
Headlines in Telugu:
  1. “జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి: ప్రజలకు మెరుగైన సేవలే గుర్తింపును తెస్తాయి”
  2. “సివిల్ సర్వీసెస్ అధికారులకు శిక్షణ: జిల్లా అభివృద్ధి పై కీలక సూచనలు”
  3. “ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సివిల్ సర్వీసెస్ అధికారుల పాత్ర”
  4. “సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సర్వీసెస్ శిక్షణ ముగింపు కార్యక్రమం”

*జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి* 

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తేనే అధికారులకు గుర్తింపు వస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ఎంసి హెచ్ ఆర్ డి ద్వారా జిల్లాకు వచ్చిన 30 మంది శిక్షణ సివిల్ సర్వీసెస్ అధికారులు జిల్లాలోని వివిధ కొన్ని రోజులుగా ఆరు బృందాలు వారి ఏర్పడి శిక్షణలో పాల్గొన్నారు. వీరి శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం సంగారెడ్డి కలెక్టర్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి సివిల్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.

 అధికారుల క్షేత్రస్థాయి పర్యటనల అనుభవాలను అర్థం చేసుకోవడం, వాటి ద్వారా జిల్లాలో అవసరమైన మార్పులను ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి ముఖ్య ప్రాధాన్యతా అంశాలను తెలియజేశారు. వనరుల వినియోగం, సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ, పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. సివిల్ సర్వీసెస్ అధికారులు క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో సివిల్ సర్వీసెస్ అధికారులు కీలక పాత్ర వహించాలని సూచించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే అవకాశం సివిల్ సర్వీసెస్ అధికారులకు దక్కుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేశాభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులకు కలెక్టర్ వివరించి జిల్లాలో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలు మహిళా శక్తి సంఘాలు సంక్షేమ గురుకుల పాఠశాలను బస్తీ దావకానలు మున్సిపాలిటీ లు, డంప్ 

యార్డ్ లు వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమంలో భాగంగా సివిల్ సర్వీసెస్ అధికారులు తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పిడి డిఆర్డిఏ జ్యోతి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version