ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం చట్టరీత్యా నేరం
– ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్ మానుకొండి
– బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దు.
– జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
ఐ పి ఎల్ క్రికెట్ మ్యాచ్ లు దేశంలో తేదీ 22.3.2025 న మొదలు కాబడినవి, ఇవి సుమారు రెండు నెలల పాటు కొనసాగుతాయని జిల్లా ఎస్పీఎం రాజేష్ చంద్ర ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయములో చాలా మంది యువకులు మ్యాచ్ గెలుపు ఓటముల విషయములో పెద్ద మొత్తములో బెట్టింగ్ చేసే అవకాశం ఉన్నదనీ. ఇలా చేయడం వలన కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగి చివరకు ఆత్మహత్య లు చేసుకునే ప్రమాదం కలదన్నారు. ఈ మ్యాచులు ప్రారంభం అయ్యాయి కావున తల్లితండ్రులు మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు ఉన్నాయా గమనించి వారితో తరచూ మాట్లాడగలరు. లేదంటే డబ్బులు, ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది. మీ కష్టార్జితాన్ని, కన్న బిడ్డలను బెట్టింగ్ విషయములో కోల్పోవద్దు. సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ. సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ. అప్పులు చేసి, చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని కావున అందరూ వీటి భారీనా పడకుండా అప్రమత్తముగా ఉండాలని జిల్లా ఎస్పి అన్నారు. ఐ పి ఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఐ పి ఎల్ క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి. ఎవరైనా ఐ పి ఎల్ క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్ కు పాల్పడితే పోలీస్ వారికీ సమాచారం ఇవ్వగలరనీ ఇచ్చిన వారి వివరములు గోప్యముగా ఉంచబడుతాయన్నారు.