భద్రాచలంలో 17న భద్రగిరి ప్రదక్షిణ
పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీరామ జన్మోత్సవం
వేలాదిగా భక్తులు పాల్గొనాలని పిలుపు
“శ్రీరామ నామం అజేయం” – రామకోటి రామరాజు
రామనామమే పరమ శ్రేయస్సు అని సందేశం
ప్రశ్న ఆయుధం..భద్రాచలం, సెప్టెంబర్ 16
శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసు పురస్కరించుకొని భద్రాచలంలో ఈ నెల 17న భద్రగిరి ప్రదక్షిణ జరగనుంది. బుధవారం ఉదయం భద్రాచల దేవస్థానం ఆధ్వర్యంలో ఈ దైవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తెలిపారు.
భక్తులు వేలాదిగా పాల్గొని సీతారాముల కృపకు పాత్రులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. “రామనామం అజేయం, శ్రీరామ అంటే సమస్త శుభాలు కలుగుతాయి. రామ నామాన్ని మించిన నామం మరొకటి లేదు. ప్రతిరోజూ రామనామాన్ని లిఖించడం ద్వారా జీవితం పరిపూర్ణమవుతుంది” అని రామరాజు భక్తులకు సందేశమిచ్చారు.