గజ్వేల్ కు చేరుకున్న భద్రాచల గోటి తలంబ్రాలు

*గజ్వేల్ కు చేరుకున్న భద్రాచల గోటి తలంబ్రాలు (వడ్లు)*

*రామకోటి రామరాజు కృషి, పట్టుదల అభినందనీయం – మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి*

*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి తలంబ్రాల దీక్షకు స్వీకారం*

ప్రశ్న ఆయుధం

భద్రాచల సీతారాముల వారి కళ్యానానికి గోటితో ఓలిచిన తలంబ్రాలు వాడుతారు. వీటికి సంబందించిన వడ్లు శుక్రవారం నాడు భద్రాచలం నుండి 250కిలోల వడ్లు గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థకు అందాయి. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. అనంతరం మాట్లాడుతూ మన గజ్వేల్ ప్రాంతానికి ముచ్చటగా మూడోసారి గోటి తలంబ్రాలు (వడ్లు) తీసుకురావడం తెలంగాణ ప్రాంతం నుండి రామకోటి సంస్థకు అవకాశం ఇవ్వడం రామకోటి రామరాజు భక్తికి నిదర్శనం అన్నారు. గత 26 సంవత్సరాల కృషిని భద్రాచల దేవస్థానం గుర్తించడం రామకోటి రామరాజును పలు మార్లు సన్మానించడం గర్వించదగ్గ విషయం అన్నారు.

మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ రామకోటి సేవలు అభినందనీయం అని ప్రజలను భక్తిమార్గం వైపు వెళ్లే విధంగా కృషి చేస్తూ, రామకోటి లిఖింపజేస్తూ, భద్రాచలంలో శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణంలో ఉపయోగించే గోటి తలంబ్రాలు ఇక్కడి నుంచి పంపే విధంగా కృషి చేస్తున్న రామకోటి రామరాజు అభిందనీయుడు అని అన్నారు, అలాగే రామకోటి స్వప్నం రామకోటి స్థూపం కోసం స్థలం ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కృష్ణాలయం ప్రతినిధులు యెలగందుల రాంచంద్రం, ఉప్పల వెంకటేశం, దూబకుంట మెట్రాములు, అత్తెలి లక్ష్మయ్య, మరియు గుంటుకు శ్రీను, సమీర్, నక్క రాములు గౌడ్, యాదగిరిగ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment