సిద్ధిపేట, గజ్వేల్, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): భద్రాచల రాములవారి కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను శనివారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన రిటైర్డ్ ఎంఈవో యెలగందుల సుకేందర్, లక్ష్మీ దంపతులకు శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవాసంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తలంబ్రాల పవిత్రత తెలియజేసి అందజేసి ఆశీర్వాచనాలు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాల నుండి 1కోటి 20లక్షల రామనామాలు లిఖించి రామకోటి సంస్థకు అందించి భక్తిని చాటుకున్న గొప్ప భక్తులని కొనియాడారు. వీరి ఆధ్యాత్మిక సేవ అమోఘం అని, ఎంతో మంది దంపతులకు వీరు ఆదర్శంగా నిలిచారన్నారు. రామకోటి సంస్థకు ఆదర్శ దంపతులుగా నిలిచారన్నారు. భద్రాచల కల్యానానికి గోటి తలంబ్రాలు అందించి, ఇప్పుడు కళ్యాన తలంబ్రాలు అందజేస్తున్నామన్నారు. భద్రాచల తలంబ్రాలు కొన్నైనా మన ఇంటిలో ఉంటే శ్రీరామరక్ష అన్నారు.
రిటైర్డ్ ఎంఈవో దంపతులకు భద్రాచల రామయ్య తలంబ్రాలు
Oplus_0