సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు పాల్గొన్నారు. భద్రాచలం మండలానికి చెందిన జయమ్మ గారు ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొంది, వాటికి సంబంధించిన ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించేలా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి దరఖాస్తు చేయగా, 48,000 రూపాయల విలువైన చెక్కు మంజూరైంది. అట్టి చెక్కును ఈరోజు జయమ్మ గారికి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు అందజేశారు.జయమ్మ గారి కుటుంబ సభ్యులు, ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొంబోతుల రాజీవ్, నర్రా రాము, భోగాల శ్రీనివాస్ రెడ్డి, పుల్లగిరి నాగేంద్ర, తాజ్. పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టయ్యింది