త్రిష’ ప్రతిభకు భద్రాద్రి జేజేలు

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన భద్రాచలం ఎమ్మెల్యే  త్రిషను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది

భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం

అండర్ -19 ఐసీసీ వరల్డ్ కప్ మహిళా క్రికెట్ టోర్నమెంట్ భారత జట్టు కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషను నెహ్రూ కప్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం భద్రాచలం పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదాన సమీప ప్రాంగణంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.

భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి త్రిషకు శుభాకాంక్షలు తెలిపారు. నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి అధ్యక్షతన, క్రికెట్ ప్రేమికులు ముర్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అభినందన సమావేశంలో… ఎమ్మెల్యే మాట్లాడుతూ త్రిష చూపిన ప్రతిభను ఎంతగానో కొనియాడారు. త్రిషను తీర్చిదిద్దిన తండ్రి జిమ్ రామ్ రెడ్డిని, ఆయన సతీమణిని, కుటుంబ సభ్యులను కోచ్ లను అభినందించారు.

1994 నుంచి నెహ్రూ కప్ ను నిర్వహిస్తూ…ఇటువంటి గొంగడి త్రిశలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన నెహ్రూ కప్ నిర్వాహకుల సేవలను ప్రసంసించారు.గొంగడి త్రిష క్రికెట్ ప్రగతిలో నెహ్రూ కప్ బీజం వేయటం అభినందనీయమన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా త్రిషను ప్రోత్సహిస్తామని…ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతానని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో నెహ్రు కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, క్రికెట్ ప్రేమికులు ముర్ల రమేష్, పట్టణ ప్రముఖులు కంభంపాటి సురేష్ కుమార్, చల్లగుల్ల నాగేశ్వరరావు,గోల్ల భూపతిరావు, గాదే మాధవరెడ్డి, సాని కొమ్ము శంకర్ రెడ్డి, డాక్టర్ కృష్ణ ప్రసాద్, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటమల్ల సురేష్ బాబు, భీమవరపు వెంకట్ రెడ్డి,పూనెం కృష్ణ, రంగారెడ్డి, మారెడ్డి శివాజీ, మహిళా నాయకురాలు సరిత, పద్మప్రియ, నెహ్రూ కప్ ఉపాధ్యక్షులు గుమ్ములూరి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి మడిపల్లి నాగార్జున, కమిటీ సభ్యులు పూనెం ప్రదీప్ కుమార్,బాల మురళి,గుమ్మడపు దుర్గాప్రసాద్, క్రికెట్ కోచ్ సుబ్రహ్మణ్యం, అశోక్, గుంటూ రాజేష్, సొంది రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment