ప్రపంచవ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరు మారుమోత…

ప్రపంచవ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరు

మారుమోత…

అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ చేజిక్కించుకోవడంలో భద్రాచలం కి చెందిన గొంగడి.త్రిషారెడ్డి కీలక పాత్ర…

ఇండియాకు వరల్డ్ కప్ అందించిన గొంగడి త్రిషారెడ్డి కి దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ..

అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో19 ఏళ్ల గొంగడి త్రిష సంచలనం సృష్టించారు. 7 మ్యాచుల్లో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు.ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్ ను చాకచక్యంగా ఎదుర్కొంటు ఈ టోర్నీలో

ఒక సెంచరీ కూడా చేసింది.యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144గా ఉండటం విశేషం. మహిళా క్రికెట్ విభాగంలో మిథాలీ రాజ్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ. భారత క్రికెట్ లో సంచలనాలు సృష్టించారు.ఆ వరుసలో చేరేందుకు సంసిద్ధమవుతోంది తెలుగుతేజం.అద్భుతమైన బౌలింగ్, ఔరా అనిపించే బ్యాంటింగ్తో ప్రత్యర్థులకు ముచ్చేమటలు పట్టిస్తోంది. పల్లెటూరి నుంచి మొదలైన క్రీడాకుసుమం దండయాత్ర

ప్రపంచ వేదికపై పరుగుల వరద పారిస్తోంది. మహిళల అండర్ -19 ప్రపంచకప్ చరిత్రలోనే తొలి శతకం నమోదు చేసి.. సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకుంది.ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు గొంగడి త్రిషవే. బౌలింగ్లోనూ సత్తా చాటి గొంగడి త్రిష 7 వికెట్లు తీశారు. భద్రాచలంకు చెందిన త్రిష ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఓపెనర్గా వచ్చి 4, 27, 49, 40, 110, 44 రన్స్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment